భార్య మృతికి కారకుడైన భర్తకు పదేళ్ల జైలు

భార్యను వేధింపులకు గురిచేసి ఆమె మృతికి కారకుడైన కేసులో ఓ వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష, రూ.రెండు వేల జరిమానా విధిస్తూ మెదక్ కోర్టు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి జితేందర్ తీర్పును వెలువరించనట్లు పాపన్నపేట ఎస్సై విజయ్ కుమార్ సోమవారం వెల్లడించారు.

Update: 2023-06-05 16:23 GMT
భార్య మృతికి కారకుడైన భర్తకు పదేళ్ల జైలు
  • whatsapp icon

దిశ, పాపన్నపేట : భార్యను వేధింపులకు గురిచేసి ఆమె మృతికి కారకుడైన కేసులో ఓ వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష, రూ.రెండు వేల జరిమానా విధిస్తూ మెదక్ కోర్టు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి జితేందర్ తీర్పును వెలువరించనట్లు పాపన్నపేట ఎస్సై విజయ్ కుమార్ సోమవారం వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామానికి చెందిన పెద్దారం కృష్ణ అనే వ్యక్తి తన భార్య యశోదను వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె గత ఏడాది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదట మెదక్ కోర్టు అసిస్టెంట్ జడ్జి జితేందర్ నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.రెండు వేల జరిమానా విధించినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News