Cyber Fraud: ఆన్‌లైన్‌లో ‘కుటుంబ సర్వే’ ఫ్రాడ్ లింక్.. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే అంతే.. వార్నింగ్ ఇస్తున్న సైబర్ పోలీసులు

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువైపోయాయి. సైబర్ నేరగాళ్లు ఒక్క చిన్న లింక్ సాయంతో లక్షలు, కోట్లు కొట్టేస్తున్నారు.

Update: 2024-11-08 03:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువైపోయాయి. సైబర్ నేరగాళ్లు ఒక్క చిన్న లింక్ సాయంతో లక్షలు, కోట్లు కొట్టేస్తున్నారు. అలాంటి ఓ ఫ్రాడ్ లింక్ ఇప్పుడు ఆన్‌లైన్‌‌లో చక్కర్లు కొడుతోందని హెచ్చరిస్తున్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఫోర్స్ పోలీసులు. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో చెబుతున్న దాని ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 6 నుంచి ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వేని టార్గెట్‌గా చేసుకున్న కొందరు సైబర్‌ నేరగాళ్లు.. ‘కుటుంబ సర్వే’ పేరుతో ఫ్రాడ్ లింక్స్ పంపిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి లింక్స్ నిజమే అనుకుని క్లిక్ చేస్తే.. మీ ఖాతాలు ఖాళీ అవడం ఖాయం అని వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా కుటుంబ సర్వే పేరుతో కాల్స్ చేసి ఓటీపీలు అడిగినా ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పొద్దని సూచిస్తున్నారు.

అధికారులే నేరుగా ఇంటికి వచ్చిన సర్వే చేస్తారని, అంతేకానీ లింక్స్ పంపించి అందులో డేటా నమోదు చేయమని ప్రభుత్వం అడగదు అంటూ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. ఇటీవల సైబర్‌ నేరగాళ్ల దెబ్బకి ఎక్కువగా ఎడ్యుకేటెడ్ పీపుల్, ఉన్నత స్థాయిలో ఉన్నవారే బలవుతున్నారు. ఇక తాజాగా సైబర్ ఫ్రాడ్‌స్టర్లు రాజకీయ, పోలీసుల వాట్సప్ డీపీ ఫోటోలు పెట్టి కూడా ప్రజలను భయపెట్టి దోపిడీలకు పాల్పడుతున్న నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.. సమగ్ర సర్వే పేరుతో ఎవరైనా ఫోన్ చేసినా, లింక్‌లు పంపినా నమ్మవద్దని, సైబర్ కేటుగాళ్ల వలలో పడొద్దని ముందగానే రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేశారు.


Similar News