కీచక బాబా బాగోతం బట్టబయలు..

కీచక బాబా బాగోతాన్ని బట్టబయలు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.

Update: 2023-06-13 12:00 GMT

దిశ, హనుమకొండ టౌన్ : కీచక బాబా బాగోతాన్ని బట్టబయలు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. వరంగల్ జిల్లా ఏనుమామూల ప్రాంతానికి చెందిన ఓ కీచక బాబాను టాస్క్ పోర్స్ పోలీసులు పట్టుకున్నారు. తన మంత్రశక్తులతో కుటుంబంలో ఏమైనా కలహాలు, బార్య భర్తల మద్య తగాధాలు, ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తా అని నమ్మించి పలువురు మహిళలు, యువతులను లోబరుచుకున్నాడు. వివాహితపై కన్నేసిన దొంగబాబా ఆమెకు తన భర్తతో ఉన్న విబేదాలను దృష్టిలో ఉంచుకుని, పూజలు చేస్తునట్టు నటించి ఆమెపై అత్యాచారం చేశాడు. భయపడిపోయిన ఆమె అసలు విషయం ఇంట్లో చెప్పింది. బాధితురాలును వెంటబెట్టుకుని కుటుంబ సభ్యులు టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించడంతో కీచక బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది.

దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కీచకబాబాని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా తాను తమిళనాడు చెందిన వ్యక్తిని అని, దాదాపు 40 సం. ల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డానని, తన పేరు షైక్నాలా లబ్బే అని తెలిపాడు. దీనికి సంబందించి టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎం. జితేందర్ రెడ్డి వివరాలు వెల్లడించాడు. దొంగబాబా నుంచి ఎర్ర ధారాలు, నల్ల ధారాలు, తాయత్తులు, నిమ్మకాయలు, దిష్టి గురుగులు, వనములికలు, నూనె డబ్బాలు, నగదు రూ. 25,000 స్వాధీనం చేసుకున్నారు. దొంగ బాబాని చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావు, జనార్థన్ రెడ్డి, ఎస్ఐ శరత్ కుమార్, లవన కుమార్, సిబ్బంది హెడా కానిస్టేబుల్ స్వర్ణలత, రాజేందర్, కరుణాకర్, శ్రావణ్ కుమార్, నాగరాజులను పోలీస్ కమిషనర్ అభినందించారు.


Similar News