Arrest : రెక్కీ నిర్వహిస్తూ.. దొంగతనాలు చేస్తూ.. చిక్కిన నిందితులు

తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా చేసుకుని వివిధ ప్రాంతాల్లో

Update: 2024-10-26 13:40 GMT

దిశ, కోదాడ: తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా చేసుకుని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగలను పోలీసులు పట్టుకున్నారు. శనివారం కోదాడ డీఎస్పీ (Kodad DSP) కార్యాలయంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మేళ్లచెరువులో మండలం రామాపురం బొమ్మల సెంటర్ వద్ద మేళ్లచెరువు ఎస్ఐ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అనుమానాస్పద స్థితిలో ఉన్న ఇద్దరు నేరస్తులు చిక్కారు. చోరీ చేసిన బంగారాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో విక్రయించేందుకు వెళుతుండగా పోలీసులకు చిక్కారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లి మండలంలోని సర్వారం గ్రామానికి చెందిన తుమ్మడపల్లి సైదులు ప్రస్తుతం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెన్నారం లో ఉంటున్నాడు. సైదులు గతంలో పలు నేరాల్లో శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదల అయ్యాడు. ఇటీవల అతనికి ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలకు చెందిన పిన్నెబోయిన నాగేశ్వరరావు జాన్ పహాడ్ లో పరిచయమయ్యాడు. వీరిద్దరూ దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు.

వీరికి సైదులు భార్య దుర్గ, బంధువైన కృష్ణా జిల్లా కంచికచర్ల కు చెందిన నల్లూరి నరసింహారావు తోడయ్యారు. వీరంతా పగటి వేళలో పట్టణాలు, గ్రామాల్లో వీధుల్లో బైక్ పై తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి తాళాలు పగలగొట్టి ఇళ్లలోని సొమ్మునంతా చోరీ చేస్తారు. పలు ట్రాక్టర్ ఇంజిన్లు, ట్రక్కులు, మోటార్ సైకిళ్లను కూడా వీరి చోరీలకు గురయ్యాయి. వీరి నుంచి 8 తులాల బంగారం, 15 తులాల వెండి, రూ.6.53 లక్షల విలువైన నాలుగు బైక్ లు, నాలుగు ట్రాక్టర్ ట్రక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న(Kodad DSP) కోదాడ డీఎస్సీ ఎం.శ్రీధర్ రెడ్డి, రూరల్ సీఐ రజితా రెడ్డి, మేళ్లచెరువు పీ పరమేష్, హెడ్ కానిస్టేబుళ్లు జూకూరి నరహరి, కత్తుల రాంబాబు, జూకూరి నాగేశ్వరరావు, పీసీలు దిలీప్ కుమార్, మాదాసు రామారావు, ఏ రామ్ కుమార్, ఎం.వెంకటేశ్వర్లు, పీ రామకృష్ణాచారి, హోంగార్డు నరసింహారావు ను సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ అభినందించారు.

అక్రమ రవాణా సహించేది లేదు : డీఎస్పీ శ్రీధర్ రెడ్డి

గంజాయి వ్యాపారం అక్రమ ఇసుక వ్యాపారం పిడిఎస్ బియ్యం ప్రజా పంపిణీ బియ్యం, అక్రమ వ్యాపారాలు చేస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని అందులో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఉన్న ప్రభుత్వ అధికారులు ,పోలీస్ సిబ్బంది, మీడియా వాళ్ళు ఉన్న వారిని విడిచి పెట్టేది లేదని చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేస్తామని తెలిపారు.


Similar News