విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి

సత్తుపల్లి మండలం రేగళ్లపాడులో పొలంలో దుక్కి దున్నతున్న ట్రాక్టర్ డ్రైవర్ (Driver)ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Update: 2024-10-26 14:29 GMT

దిశ,సత్తుపల్లి : సత్తుపల్లి మండలం రేగళ్లపాడులో పొలంలో దుక్కి దున్నతున్న ట్రాక్టర్ డ్రైవర్ (Driver)ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామానికి చెందిన సోయం ఉదయ్ కిరణ్ (Soyam Uday Kiran) (24) శనివారం మధ్యాహ్నం పొలంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అది విరిగి ఉదయ్ కిరణ్ పై పడింది. దీంతో ఉదయ్ కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News