వివాహిత అనుమానాస్పద మృతి

న్యూ బోయినపల్లి నేతాజీ నగర్ లో నివాసం ఉంటున్న వనిత(30) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు బోయినపల్లి ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు.

Update: 2025-01-01 15:53 GMT

దిశ, తిరుమలగిరి : న్యూ బోయినపల్లి నేతాజీ నగర్ లో నివాసం ఉంటున్న వనిత(30) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు బోయినపల్లి ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం జి.నర్సింహ అనే వ్యక్తితో గత13 సంవత్సరాల క్రితం వివాహమైందని, వారికి శ్వేత అనే కుమార్తె కూడా ఉందని తెలిపారు. కాగా మృతురాలు డిసెంబర్ నెలలో గర్భవతి అని, ఆనాటి నుండి ఆమె నిరంతరం వాంతులు చేసుకుంటూ అనారోగ్యంతో బాధపడుతుందని ఆమె కూతురు చెప్పిందని ఎస్ఐ తెలిపారు.

     31న సాయంత్రం తన తల్లి ఆరోగ్యం విషమించిందని కూతురు గమనించి బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఆమె తల్లి నిద్ర నుండి లేవలేదని తెలిపింది. ఆమెను నిద్ర లేపేందుకు ప్రయత్నించినా ఆమె స్పందించకపోవడంతో వెంటనే అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. వైద్యులు ఆమెను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. అయితే మృతురాలి తండ్రి టేకుయట్ల దుర్గయ్య మాత్రం తన కుమార్తె గర్భవతి అని, ఆమె అనారోగ్యం గురించి తన అల్లుడు తనకు తెలియజేయలేదని, చట్ట ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 


Similar News