తీవ్ర విషాదం...రన్నింగ్ లో ఉన్న కార్లో మంటలు...ఒకరు సజీవదహనం

రాచకొండ కమిషనరేట్ ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్లో దారుణం జరిగింది.

Update: 2025-01-06 12:39 GMT

దిశ, ఘట్కేసర్ : రాచకొండ కమిషనరేట్ ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్లో దారుణం జరిగింది. సోమవారం సాయంత్రం ఘట్కేసర్ నుంచి గణపురం మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్ పై వెళ్తున్న వాహనంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మంటలో నుంచి తప్పించుకోబోయే తగలబడతూ పక్కనే ఉన్న ఫుట్ పాత్ పై పడి చనిపోయాడు. దగ్ధమవుతున్న కారులో ఇంకా ఎవరెవరు ఉన్నది అనేది తెలియాల్సి ఉంది. కారులో సీఎన్జీ సిలిండర్ ఉండటంతో ఎవరిని దగ్గరికి రాకుండా పోలీసులు చెదరగొడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News