చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం రైటా..? రాంగా..?.. నేడే సుప్రీం తీర్పు
చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరమా..? కాదా..? అనే విషయంపై ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించబోతోంది.
దిశ, వెబ్‌డెస్క్: చైల్డ్ పోర్నోగ్రఫీ (Child Pornography) చూడడం నేరమా..? కాదా..? అనే విషయంపై ఈ రోజు (సోమవారం) సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు వెలువరించబోతోంది. అత్యన్నత ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud), జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించబోతోంది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం తప్పు కాదంటూ మద్రాస్ హైకోర్టు (Madras High Court) గతంలో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు కావడంతో పాటు సుప్రీంకోర్టు కూడా మద్రాస్ హై కోర్టు తీర్పును తప్పుబట్టింది. ఈ క్రమంలోనే నేడు సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.
కాగా.. చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేసుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఓ 28 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. అతడు వీడియోలు డౌన్‌లోడ్ చేసుకున్నప్పటికీ ఎవ్వరికీ షేర్ చేయకపోవడంతో పాటు ఎవరినీ వేధించలేదు కాబట్టి అతడిపై క్రిమినల్ చర్యలను నిలిపి వేయాలంటూ జనవరి 11వ తేదీన మద్రాసు హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అలాగే పోర్నోగ్రఫీకి అలవాటుపడిన యువతను శిక్షించడం కన్నా వారిని సరైన మార్గం వైపు నడిపించడంపై దృష్టి సారించాలని మద్రాసు హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.
Read More: రెడ్ లైట్ ఏరియాలో ఏఐ భామల హల్‌చల్...సెక్స్ వర్కర్ల స్థానంలో హాట్ హాట్ రోబోలు