హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థిని సూసైడ్

హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

Update: 2022-12-28 11:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సీఎస్ఆర్ బిల్డింగ్ పై నుండి దూకి సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిని యువతి బీటెక్ ఫైనలియర్ చదువుతోన్న మేఘనా రెడ్డిగా గుర్తించారు. అనారోగ్య సమస్యలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News