గోవా నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్.. ఇద్దరు డ్రైవర్లు అరెస్ట్
రెండు వేరు వేరు ట్రావెల్స్ బస్సుల్లో అక్రమంగా మద్యంతో పాటు గంజాయి చాక్లెట్ల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కే. శ్రీనివాసరావు తెలిపారు.
దిశ, జహీరాబాద్: రెండు వేరు వేరు ట్రావెల్స్ బస్సుల్లో అక్రమంగా మద్యంతో పాటు గంజాయి చాక్లెట్ల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కే. శ్రీనివాసరావు తెలిపారు. గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ట్రావెల్స్ బస్సుల్లో అక్రమ మద్యం, గంజాయి చాక్లెట్లు స్మగ్లింగ్ జరుగుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు సరిహద్దులోని చిరాకుపల్లి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టామన్నారు. మెదక్ డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కే. రఘురాం ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. జంగ్ ట్రావెల్స్‌లో తనిఖీ చేయగా డ్రైవర్ ఎండీ. జబ్బార్ సీటు వెనక రెండు లీటర్ల సీసాలు 22 లభించినట్లు తెలిపారు.
దీంతో ఆ ట్రావెల్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోని.. బస్సులు సీజ్ చేశామని తెలిపారు. అదేవిధంగా ఫోల్ ట్రావెల్స్‌కి చెందిన మరో బస్సును తనిఖీ చేయగా అందులో డ్రైవర్ ఉమాకాంత్ వద్ద 15 గంజాయి చాక్లెట్లు లభించాయని చెప్పారు. డ్రైవర్ ఉమాకాంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇద్దరు డ్రైవర్లపై కేసు నమోదు చేసి, సీజ్ చేసిన బస్సును స్థానిక ఎక్సైజ్ కార్యాలయానికి తరలించినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మెదక్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ సీఐ, హెడ్ కానిస్టేబుల్‌లు మోహన్ కుమార్ , ఎండీ. అలీమ్, విట్టల్, ఈసీలు డి. మల్కయ్య, కరీం, తదితరులున్నారు.