ఘోర విషాదం.. ఆరుగురు మృతి.. మరో నలుగురి పరిస్థితి విషమం
ఓ ఇంట్లో అగ్నిప్రమాదం (fire accident) చోటు చేసుకొని ఆరుగురు మృతి చెందారు.
దిశ, వెబ్ డెస్క్: ఓ ఇంట్లో అగ్నిప్రమాదం (fire accident) చోటు చేసుకొని ఆరుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన జమ్మూ (Jammu)లోని కథువా జిల్లాలోని శివ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు.. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కాగా అప్పటికే ఇంట్లో ఉన్న వారిలో ఆరుగురు మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. అలాగే మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కాగా ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందితో కలిసి ప్రమాదానికి గల కారణాలు వెతుకుతున్నారు.