గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే గంజాయి సాగు...
లింగంపేట్ మండలంలో గుట్టు చప్పుడు కాకుండా ఇంటి వద్దే గంజాయి సాగు చేస్తూ విక్రయిస్తున్న నిందితుడితో పాటు ఐదుగురు యువకులను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
దిశ, తాడ్వాయి : లింగంపేట్ మండలంలో గుట్టు చప్పుడు కాకుండా ఇంటి వద్దే గంజాయి సాగు చేస్తూ విక్రయిస్తున్న నిందితుడితో పాటు ఐదుగురు యువకులను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. లింగంపేట ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం లింగంపేట్ మండలం రాంపల్లి కోన తండాకు చెందిన దేవపొత్ శంకర్ ఇంటి ఆవరణలో సాగు చేస్తూ విద్యార్థులు, యువకులే లక్ష్యంగా చేసుకుని అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు శంకర్ ఇంటి దగ్గర పోలీస్ సిబ్బందితో తనిఖీలు చేపట్టడంతో శంకర్ ఇంటి దగ్గర గంజాయి కొనుగోలు చేస్తున్న ఐదుగురు యువకులను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
పట్టుబడిన నిందితుల నుంచి 1.315 కేజీల ఎండిన గంజాయి, ఒక గంజాయి మొక్కను రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు చరవానులను స్వాధీనం చేసుకున్నట్లు వారు వెల్లడించారు. పట్టుబడిన నిందితుల పై కేసు నమోదు చేసి రిమాండ్ కు మించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. గంజాయి, మత్తుకు బాని సై యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాల రవాణా, వాడకం వంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.