సింగిల్ విండో డైరెక్టర్ ఆత్మహత్య..
క్రమ సంబంధం ఓ ప్రజాప్రతినిధిని బలిగొంది. మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా మంచి పేరున్న ఓ ప్రజాప్రతినిధి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలో చోటు చేసుకుంది.
దిశ, కోనరావుపేట : అక్రమ సంబంధం ఓ ప్రజాప్రతినిధిని బలిగొంది. మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా మంచి పేరున్న ఓ ప్రజాప్రతినిధి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కోనరావుపేట మండల సింగిల్ విండో డైరెక్టర్ పల్లం సత్తయ్య (62) శనివారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ సత్తయ్య ఆదివారం ఉదయం మృతి చెందాడు.
సత్తయ్యకు గత 8 సంవత్సరాల క్రితం కరీంనగర్ కి చెందిన మూట రేణుకా అనే మహిళతో పరిచయం ఏర్పడగా ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ సంబంధాన్ని అదునుగా తీసుకొని రేణుకా, ఆమె సోదరుడు అశోక్ కుమార్ తమకు కరీంనగర్ లో ఇల్లు కొని ఇవ్వాలని తరుచూ సత్తయ్యను వేధించేవారు. దాంతో మనస్తాపం చెందిన సత్తయ్య నా చావుకు రేణుకా, తన సోదరుడు అశోక్ కుమార్ లే కారణమని సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య పాల్పడ్డాడు. కాగా మృతుడు గతంలో కూడా రెండు సార్లు ఆత్మహత్యానికి ప్రయత్నించాడని మృతుడి భార్య పల్లం మల్లవ్వ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సత్తయ్య మృతికి కారణం అయిన ముద్దాయి రేణుక (45)ను అరెస్టు చేసి విచారించి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కాగా ఓ మంచి ప్రజాప్రతినిధిని కోల్పోవడంతో అటు గ్రామంలో ఇటు మండలంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.