రచయిత్రిపై ఎస్ఐ అత్యాచారం.. నగ్న వీడియోలతో కోరికలు తీర్చుకుంటూ..
చట్టాన్ని రక్షించాల్సిన అధికారే భక్షకుడిగా మారాడు. అన్యాయం జరిగిన వారికి అండగా నిలవాల్సిన అధికారే కామాంధుడిలా మారాడు.
దిశ, వెబ్‌డెస్క్ : చట్టాన్ని రక్షించాల్సిన అధికారే భక్షకుడిగా మారాడు. అన్యాయం జరిగిన వారికి అండగా నిలవాల్సిన అధికారే కామాంధుడిలా మారాడు. రోడ్డుపై నిలబడిన మహిళను భయపెట్టి.. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచక ఎస్ఐ. ఆపై ఆ దృశ్యాలను వీడియోలు తీసి బ్లాక్ మెయిల్‌కు దిగాడీ పోలీస్ నేరస్తుడు. ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం..
గాజియాబాద్ జిల్లాలోని దాస్నాకు చెందిన ఓ రచయిత్రి ఏప్రిల్ 25న తన ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిలబడింది. అదే సమయంలో కవినగర్‌కు చెందిన ఎస్ఐ అక్షయ్ మిశ్ర అటువైపు వచ్చాడు. ఒంటరిగా ఉన్న ఆమెను భయపెట్టేలా ప్రశ్నలు అడిగి ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు రోజు ఫోన్ చేస్తూ పరిచయం పెంచుకున్నాడు. అలా స్నేహం ముసుగులో మే 4న ఎస్ఐ అక్షయ్ మిశ్ర రచయిత్రి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె ఇచ్చిన టీలోనే మత్తు మందు కలిపి స్పృహ తప్పేలా చేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలన్నీ వీడియోలు తీసి అప్పటి నుంచి బాధితురాలిని బెదిరిస్తూ తరచూ అత్యాచారాలకు పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆమెను భయపెట్టి అబార్షన్ చేయించాడు. దీంతో ఆ రచయిత్రి ధైర్యం చేసి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ అక్షయ్ మిశ్రపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.