కొడుకును గల్ఫ్ పంపింది...తాను ప్రాణం తీసుకుంది...
కొడుకును గల్ఫ్ పంపి తాను ప్రాణం తీసుకున్న ఓ మాతృమూర్తి విషాద ఉదంతం ఇది.
దిశ, బోయిన్పల్లి : కొడుకును గల్ఫ్ పంపి తాను ప్రాణం తీసుకున్న ఓ మాతృమూర్తి విషాద ఉదంతం ఇది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని కొదురుపాక గ్రామానికి చెందిన కత్తెరపాక కనకవ్వ (52) అనే మహిళకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా పెద్దకొడుకును ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు పంపగా రూ. 5 లక్షల వరకు అప్పు అయింది. ఆ అప్పును ఎలా తీర్చాలనే మనోవేధనతో ఇంట్లో నుంచి వెళ్లి మధ్య మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు కొడుకు కత్తెరపాక అఖిల్ ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బోయినిపల్లి ఎస్సై పృథ్వీధర్ గౌడ్ వెల్లడించారు.