రూ. 54 వేల విలువ గల కలప పట్టివేత

మండలంలోని అల్లీనగర్ గ్రామంలో అనుమతి లేకుండా సేకరించిన టేకు కర్రతో మంచాలు తయారు చేస్తుండగా బుధవారం వాటిని స్వాధీనం చేసుకున్నట్టు ఎఫ్ఆర్ఓ సుష్మరావు తెలిపారు.

Update: 2024-10-09 12:04 GMT

దిశ,జన్నారం : మండలంలోని అల్లీనగర్ గ్రామంలో అనుమతి లేకుండా సేకరించిన టేకు కర్రతో మంచాలు తయారు చేస్తుండగా బుధవారం వాటిని స్వాధీనం చేసుకున్నట్టు ఎఫ్ఆర్ఓ సుష్మరావు తెలిపారు. అల్లీనగర్ గ్రామంలోని ఆత్రం నగేష్ ఇంటి వద్ద అక్రమంగా కలపను మంచాలుగా తయారు చేసి అమ్ముతున్నారనే సమచారంతో తన సిబ్బందితో వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కలప విలువ రూ. 54 వేలు ఉంటుందని ఎఫ్​ఆర్ఓ తెలిపారు. ఎఫ్ఆర్ఓ తో పాటు డీఆర్ఓ తిరుపతి, ఎఫ్ఎస్ఓ లు శివకుమార్, మధుకర్, కిరణ్మయి, ఎఫ్బీఓ లు లాల్బాయి, పరమేశ్వర్, తన్విర్ పాషా ఉన్నారు. 

Tags:    

Similar News