కారు, ఆటో ఢీ.. ఆటో డ్రైవర్ మృతి..

రోడ్డు ప్రమాదంలో ఆటోట్రైవర్ మృతి చెందిన సంఘటన పాల్వంచ మండలంలో గురువారం జరిగింది.

Update: 2023-06-01 10:51 GMT

దిశ, మాచారెడ్డి : రోడ్డు ప్రమాదంలో ఆటోట్రైవర్ మృతి చెందిన సంఘటన పాల్వంచ మండలంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధిపేట్ - దోమకొండ అప్రోచ్ రోడ్డులో కారు, ఆటో ఢీకొని ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఒడ్డె రాజు అనే వ్యక్తి వ్యవసాయం పనినిమిత్తం ఆటోలో అతని సోదరిని విడిచిపెట్టి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దోమకొండ మండల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కు చెందిన కారుగా గుర్తించారు. మృతుడు లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News