ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు డాక్టర్లు స్పాట్ డెడ్

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2023-02-26 05:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడుపల్లె మండలం చిన్నశెట్టిపల్లిలో ఆదివారం ఉదయం ఓ కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రి వైద్యులు వికాస్, కల్యాణ్, ప్రవీణ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News