Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం

రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన కాకినాడ (Kakinada) జిల్లాలో చోటుచేసుకుంది.

Update: 2025-01-02 04:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన కాకినాడ (Kakinada) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగ్గంపేట (Jaggampet) నుంచి రాజమండ్రి (Rajahmundry)కి బైక్‌పై ఇద్దరు యువకులు బయలుదేరారు. ఈ క్రమంలోనే మురారి (Murari) వద్దకు రాగానే బైక్ అతివేగంతో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆ ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు మోరంపూడి (Morampudi) గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతరం ప్రమాదం జరిగిన విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News