అభ్యంతరకర పోస్టుల ఫలితం...పోలీసుల అదుపులో వ్యక్తి

సోషల్​ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

Update: 2024-10-15 11:14 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి : సోషల్​ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త అనుమల్ల మహేష్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 26న దుబ్బాకలో మంత్రి కొండా సురేఖ, ఇతర ఎమ్మెల్యేల సమక్షంలో షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.

    ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో కొందరు చేసిన పోస్ట్ లు పెద్ద దుమారం లేపాయి. అయితే మహేష్ కూడా తులం బంగారం హామీ ఏమైందని సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. ఈ ఘటనపై ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మహేష్ ను అరెస్టు చేసి హైదరాబాద్​లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉండగా మహేష్ పలు పేర్లతో సోషల్ మీడియాలో అకౌంట్స్, ఇతర పేజీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. 

Tags:    

Similar News