అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

జైన్నూర్ మండలంలోని పాట్నాపూర్ గ్రామానికి చెందిన డక్రే రాందాస్ శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Update: 2024-11-22 13:10 GMT

దిశ, ఆసిఫాబాద్ : జైన్నూర్ మండలంలోని పాట్నాపూర్ గ్రామానికి చెందిన డక్రే రాందాస్ శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం డక్రే రాందాస్ తనకున్న 2 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా దిగుబడి సరిగ్గా రాలేదు. దాంతో కౌలుకు మరో భూమి తీసుకొని పంట వేయాలనుకున్నాడు. కానీ డబ్బులు లేకపోవడంతో పాటు వేసిన పత్తి పంట దిగుబడి లేక మనస్థాపం చెంది గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. 


Similar News