విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

క్రేన్ నడుపుతుండగా విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Update: 2024-11-22 15:33 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : క్రేన్ నడుపుతుండగా విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన కథనం ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ నౌషద్ ఆలం బొల్లారం మున్సిపాలిటీలో నివసిస్తూ క్రేన్ ఓనర్ రామారావు దగ్గర కొన్నేళ్ల నుండి ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు.

    క్రేన్ ఆపరేటింగ్ పనులలో భాగంగా బాచుపల్లి ఇండస్ట్రీస్ రోడ్డులో గల టింబర్ డిపోలో శుక్రవారం ఇనుప దూలాలను పైకి ఎత్తుతున్నాడు. పైకి ఎత్తే క్రమంలో 11 కేవీ విద్యుత్ వైర్లు క్రేన్ కు తగిలి షాక్ తగిలింది. ఆపరేటర్ మహ్మద్ నౌషద్ ఆలం విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News