10 మంది పిల్లల్ని కాపాడిన రాచకొండ పోలీసులు.. కాస్త ఆలస్యం అయితే ఎక్కడికి తరలించేవారో తెలుసా?

హైదరాబాద్‌(Hyderabad)లో పసిపిల్లల్ని విక్రయించే ముఠాను రాచకొండ పోలీసులు(Rachakonda Police) అదుపులోకి తీసుకున్నారు.

Update: 2025-03-19 11:01 GMT
10 మంది పిల్లల్ని కాపాడిన రాచకొండ పోలీసులు.. కాస్త ఆలస్యం అయితే ఎక్కడికి తరలించేవారో తెలుసా?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో పసిపిల్లల్ని విక్రయించే ముఠాను రాచకొండ పోలీసులు(Rachakonda Police) అదుపులోకి తీసుకున్నారు. బుధవారం చాలా చాకచక్యంగా వ్యవహరించి పది మంది పసిపిల్లల్ని కాపాడారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిన్నారులను దత్తత తీసుకుంటున్నట్లు అందరినీ నమ్మంచి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఈ ముఠా విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తు తేలింది. ఇప్పటివరకు ఇదే ముఠా ఆయా రాష్ట్రాల్లో దాదాపు 18 మంది పిల్లల్ని విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో కీలకంగా వ్యవహరిస్తున్న అమూల్యను కూడా పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. చట్టవిరుద్ధంగా పాల్పడే ఎవరినీ వదిలిపెట్టబోమని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(Rachakonda CP Sudheer Babu) హెచ్చరించారు.

ఇదిలా ఉండగా.. పిల్లల విక్రయాల కేసులో మొత్తం ఇప్పటివరకు 27 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. కాపాడిన చిన్నారుల్లో ఆరుగురు బాలికలు, 4 బాలురు ఉన్నారు. ముఠాలో కీలక నిందితురాలైన అమూల్య ఆశా వర్కర్‌గా పనిచేస్తోందని గుర్తించారు. ఇల్లీగల్‌గా దత్తత తీసుకొని చిన్నారుల విక్రయాలు చేస్తున్నారని సీపీ పేర్కొన్నారు.

Read More..

Faheem Khan: నాగ్ పూర్ అల్లర్ల సూత్రధారి ఫహీమ్ ఖాన్ అరెస్టు 

Tags:    

Similar News