అగ్ని ప్రమాదంలో రూ.60 వేల ఆస్తినష్టం..

మండల కేంద్రంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించి పలువురు రైతులకు చెందిన గడ్డివాములు, వివిధ రకాల వ్యవసాయ సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.

Update: 2023-05-27 10:38 GMT

దిశ, తుంగతుర్తి : మండల కేంద్రంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించి పలువురు రైతులకు చెందిన గడ్డివాములు, వివిధ రకాల వ్యవసాయ సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ మేరకు దాదాపుగా రూ.60 వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. షేక్ మీరాసాబ్, షేక్ యాకుబ్ అలీ, షేక్.యాకుబ్ ల వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. ఈ మేరకు అకస్మాత్తుగా అక్కడున్న గడ్డివాములకు నిప్పు అంటుకుంది. నాలుగు గడ్డివాములతో పాటు వ్యవసాయానికి సంబంధించిన వివిధ రకాల పైపులు, వ్యవసాయ ఇంజన్ పంప్ సెట్ పూర్తిగా కాలిపోయాయి. తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News