Road Accident: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
మంగళవారం అర్థరాత్రి ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. టూ వీలర్ ను ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో సాయికృష్ణ (40) అనే వ్యక్తి స్పాట్ లోనే మరణించాడు.
దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తిరువూరు మండలం కాకర్ల గ్రామం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గుంటూరు జిల్లాకు సాయికృష్ణ (40) తిరువూరు నుంచి విజయవాడకు బైక్ పై వెళ్తుండగా.. కాకర్ల వద్ద ఎదురుగా అతివేగంతో వచ్చిన ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. దీంతో సాయికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.