Prisoner Absconding: భువనగిరి సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరార్.. ఆలస్యంగా విషయం వెలుగులోకి

భువనగిరి సబ్ జైలు (Bhongir Sub-Jail) నుంచి ఓ రిమాండ్ ఖైదీ (Remand Prisoner) పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-10-28 08:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: భువనగిరి సబ్ జైలు (Bhongir Sub-Jail) నుంచి ఓ రిమాండ్ ఖైదీ (Remand Prisoner) పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 22న రిమాండ్‌లో ఖైదీని జైలు సిబ్బంది వైద్య పరీక్షల నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి (Government Hospital) తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పోలీసుల కళ్లుగప్పి ఖైదీ అక్కడి నుంచి సైలెంట్‌గా పరార్ అయ్యాడు.

అయితే, విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తలు పాటించారు. అనంతరం రిమాండ్ ఖైదీని తిరిగి పట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా భువనగిరి సబ్ జైలు (Bhongir Sub Jail)కు తరలించారు. ఈ క్రమంలో పోలీసుల అజాగ్రత్తపై పట్టణ ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన ఖైదీపై నిరంతరం నిఘా పెట్టాల్సిన సిబ్బంది అసలు ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు.  

Tags:    

Similar News