బడిబాట కార్యక్రమానికి వెళ్తూ ప్రధానోపాధ్యాయుడు మృతి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ ప్రధానోపాధ్యాయుడు రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు.

Update: 2023-06-04 10:12 GMT

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ ప్రధానోపాధ్యాయుడు రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, తోటి ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామానికి చెందిన భిచ్చరావు (50) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటూ నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడిపూరు జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

ఆదివారం ఉదయం విధినిర్వహణలో భాగంగా నాగర్ కర్నూల్ నుండి మేడిపూరు బైక్ పై వెళ్తుండగా ఎండబెట్ల గ్రామ శివారులో పంది ఎదురుపడి అదుపుతప్పి కిందపడ్డాడు. వెంటనే స్థానికులు జనరల్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం చెందాడు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు.

Tags:    

Similar News