పోలీస్ డిపార్ట్ మెంట్‌లో చీకటి వ్యవహారాలు.. మహిళా హోంగార్డులే టార్గెట్!!
దిశ, వెబ్‌డెస్క్: మహిళలపై రోజు రోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే దారుణాలకు పాల్పడుతున్నారు. న్యాయమైన వృత్తిలో ఉండి కూడా..
దిశ, వెబ్‌డెస్క్: మహిళలపై రోజు రోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే దారుణాలకు పాల్పడుతున్నారు. న్యాయమైన వృత్తిలో ఉండి కూడా.. ఆ వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ఖాకీల్లోని కీచకుల చేష్టలకు మహిళలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. మహిళా ఉద్యోగుల ఫిర్యాదుతో ఇప్పుడిప్పుడే పోలీసు డిపార్ట్ మెంట్‌లోని చీకటి వ్యవహారాలు బయటకు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్లితే.. ఏపీలోని అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. న్యాయం చేయాల్సిన పోలీసే తనతో పని చేస్తున్న మహిళా హోం గార్డుపై కన్నేశాడు. రోజూ తనను మానసికంగా వేధించావడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్ స్పెక్టర్ మహిళను రోజూ తన చాంబర్‌కు పిలిపించుకుని.. అన్ని అక్రమ సంబంధాలు అంటగట్టి బెదిరించేవాడని పేర్కొంది. మీ ఇంటికి ఎవరెవరు వస్తారో నాకు తెలుసు.. నువ్వు రోజు నాతో ఫోన్ మాట్లాడాలి అలా అయితేనే నువ్వు జాబ్‌లో ఉంటావని బ్లాక్ మెయిల్ చేసేవాడట. అంతే కాకుండా ఒక రోజు నీతో పర్సనల్‌గా మాట్లాడాలని ఎవరూ లేని చోటుకు పిలిపించి, అసభ్యంగా ప్రవర్తించాడని, మహిళ ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఇష్యూ జిల్లాలో సంచలనంగా మారింది. ఓ పోలీసు అయి ఉండి మహిళను ఈ విధంగా వేధిస్తాడా? అంటూ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఇటీవల ఏపీలో ఓ మహిళా కానిస్టేబుల్ కోసం ఎస్సై, కానిస్టేబుల్ కొట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇలాంటి వ్యవహారాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్టేషన్లలో జరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు.