సికింద్రాబాద్ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ బైకు షోరూంలో భారీగా అగ్నిప్రమాదం జరిగి ఏడుగురు సజీవ దహనం అయిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ బైకు షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగి ఏడుగురు సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు, బాధితుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. ''తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థికసాయం పీఎమ్ఎన్ఆర్ఎప్ నుంచి అందజేస్తామని ప్రకటించారు.
Also Read : సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం
Also Read : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రాలేదా.. అయితే ఈ నెంబర్‌కు కాల్ చేయండి