Crime: మళ్లీ తెరపైకి అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య కేసు

తెలంగాణలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ గట్టు వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Update: 2022-09-09 08:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ గట్టు వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మరణ వాంగ్మూలంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పేరు చెప్పినప్పటికీ పోలీసులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారని సుప్రీంకోర్టుకు న్యాయవాది తెలిపారు. దీంతో శుక్రవారం తెలంగాణ డీజీపీతో సహా 12 మంది ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 17 ఫిబ్రవరి 2021 న రామగిరి మండలం కలవచర్లలో కారులో వెళ్తున్న అడ్వకేట్ దంపతులు వామనరావు, నాగమణిని అడ్డగించి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులను సైడ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడం మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News