చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి అదృశ్యం..

వ్యక్తి అదృశ్యమైన సంఘటన సోమవారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2023-05-08 15:49 GMT

దిశ, చైతన్య పురి : వ్యక్తి అదృశ్యమైన సంఘటన సోమవారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హరిపురికాలనీ రోడ్ నెంబర్ 2 లో నివసించే సోమరాజు చరణ్ (23) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల 5 న మెడికల్ రిపోర్టులు తీసుకువస్తానని చెప్పి ఇంట్లో నుండి వెళ్లారు. తిరిగి రాకపోవడంతో ఈనెల 6న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags:    

Similar News