రెండు బైకులు ఢీ.. ఓ వ్యక్తి మృతి

రెండు బైకులు ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

Update: 2022-09-23 11:21 GMT

దిశ, కుల్కచర్ల : రెండు బైకులు ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన కుల్కచర్ల మండలం కాళమ్మ దేవాలయం సమీపంలో చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢో కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. మృతుడు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వ్యక్తి కుల్కచర్ల మండలం అంతారం గ్రామానికి చెందిన అంజయ్యగా గుర్తించారు. హెచ్ఎఫ్ డీలక్స్, టీఎస్ 06 బి 6360, హీరో హోండా గ్లామర్ టీఎస్ 07 ఈ ఎ 6183 నంబర్ గల వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. 

Tags:    

Similar News