NIA: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. వారిపైనే ఫోకస్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు తనిఖీలు కలకలం రేపుతున్నాయి.

Update: 2022-09-05 06:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు తనిఖీలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్, హన్మకొండ, కృష్ణా జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి, హన్మకొండలోని అనిత, కృష్ణా జిల్లా మైలవరంలో రాధా ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. సోమవారం ఏకకాలంలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వీరిని పలు అంశాలపై అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సోదాలకు గల కారణాలపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. కాగా ఈ ఏడాది జూన్ లో తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్, సికిద్రాబాద్ జిల్లాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. పలువురి అరెస్టులు సైతం జరిగాయి. తాజాగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News