జియాగూడలో మర్డర్...
ద్విచక్ర వాహనం విషయంలో గొడవపడి ఓ వ్యక్తి మరణానికి కారణమైన సంఘటన కులుసుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
దిశ, కార్వాన్ : ద్విచక్ర వాహనం విషయంలో గొడవపడి ఓ వ్యక్తి మరణానికి కారణమైన సంఘటన కులుసుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గోషామహల్ ఏసీపీ సతీష్ కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి జియాగూడకు చెందిన యోగేష్ రెండు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన అరుణ్ అనే వ్యక్తి వద్ద ఓ ద్విచక్ర వాహనాన్ని 20వేల రూపాయలకు కొనుగోలు చేశారు. అందులో 20 వేల రూపాయలలో ఐదు వేలు నగదు ఇచ్చాడు. ఇరువురు మధ్య ద్విచక్ర వాహనం మాయమైపోయింది. వాహనమైన లేదా నేను అడ్వాన్స్‌గా ఇచ్చిన 5000 నగదు తిరిగి ఇవ్వాలని యోగేష్ ప్రశ్నించగా..? అది నా వాహనం కాదు ఆసిఫ్ నగర్ ప్రాంతానికి చెందిన గ్లాస్ కట్టర్ వర్కర్ సోహెల్ (23) ది అంటూ తెలిపాడు అరుణ్.
ఈ విషయంలో జియగూడ మేకల మండి వద్ద ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. అయితే ఆదివారం రాత్రి యోగేష్ తన మిత్రులతో కలిసి జియాగూడ డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ పైన వెళ్లి మద్యం సేవించి సోహేల్ పై దాడి చేశారు. సోహెల్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని తెల్లవారుజామున స్థానికులు గమనించి కులుసుంపురా పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చికిత్స నిమిత్తం సోహెల్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం సోహెల్ మృతి చెందినట్లు ఏసిపి సతీష్ కుమార్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.