Murder: తిరుపతి జిల్లాలో అమానుషం.. రూ.1500 కోసం దారుణ హత్య
డబ్బు కోసం ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన అమానవీయ ఘటన తిరుపతి (Tirupati) జిల్లాలో చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: డబ్బు కోసం ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన అమానవీయ ఘటన తిరుపతి (Tirupati) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కలికిరి (Kalikiri) గ్రామానికి చెందిన మహబూబ్ సాహెబ్, అజ్మతుల్లా (Ajmathullah) స్థానిక ప్రియదర్శిని వెజిటెబుల్ మార్కెట్‌లో కూరగాయాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే తోటి వ్యాపారి రుద్ర (Rudra) మహబూబ్ సాహెబ్ నుంచి రూ.1,500 అప్పుగా తీసుకున్నాడు. అయితే, అప్పు తిరిగి చెల్లించే క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి రుద్ర తన కుమారుడు, అనుచరులతో మార్కెట్‌కు వచ్చాడు. ఆ సమయంలో మహబూబ్ సాహెబ్ లేకపోవడంతో అక్కడే పని చేస్తున్న అజ్మతుల్లాపై రుద్ర, అనుచరులు కత్తులతో దాడి చేశారు. ఈ క్రమంలోనే అతడు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఊహించిన ఈ ఘటనలో మార్కెట్‌లో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.