ఆస్తి కోసం కన్నతల్లిని కడతేర్చిన తనయుడు..

Update: 2023-05-10 16:29 GMT

దిశ, హనుమకొండ టౌన్: ఆస్తి తగదా విషయంలో కన్నతల్లిని కొడుకు హత్య చేసిన ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. వివరాల్లో్కి వెళితే.. ఆస్తి తగదా విషయంలో కన్నతల్లిని హత్య చేసిన కోడుకును సంగెం పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. వీరినుండి పోలీసులు సెల్ఫోన్, హత్యకు వినియోగించిన బండరాయి, నిందితుడి బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 6వ తేదీన రాత్రి సంగెమ్ మండలంలోని పల్లారుగూడెం గ్రామ శివారు ప్రాంతంలో హత్య గురైన జగ్గునాయక్ తండాకు చెందిన జర్పుల శౌరికి భర్త, ఇద్దరు కుమారు ఉన్నారు. భర్త, చిన్న కుమారుడు కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు. ఈ నేపథ్యంలో వీరికి ఉన్న 30 గుంటల భూమి విషయంలో మృతురాలు, నిందితుడికి తరుచుగా గొడవలు జరిగడంతో.. మృతురాలిపై కక్ష పెంచుకున్న నిందితుడు. నిందితుడు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మృతురాలు వున్న ఇంటిలోని మరో గదిలో నివాసం వుంటున్నాడు.

భూమి విషయంలో తల్లి, కోడుకుల మధ్య తరుచుగా గోడవలు కావడంతో వీరు ఇరువురు పెద్ద మనుషుల సమక్షంలో సమస్య పరిష్కరించుకోనేందుకు సిద్ధపడ్డారు. ఇందుకోసం నిందితుడు సురేష్ మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్న నల్లబెల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ రఫీ తండ్రి తో ముస్తఫాతో కలిసి ఆటోలో రంగశాయిపేటలో పెద్దలు నిర్వహించిన పంచాయితీ పెద్దల ఇంటికి వెళ్ళగా.. మృతురాలు ఒంటరిగా వచ్చింది. పెద్దలు చేసిన పంచాయితీ మృతురాలు శౌరి, నిందితుడు సురేష్ రాజీపడ్డారు. దీంతో తల్లికి మాయ మాటలు చెప్పి షేక్ రఫీ ఆటోలో ఇంటికి తిరిగి బయలుదేరారు. మార్గమధ్యలో మృతురాలు నిందితులుతో కలిసి మద్యం సేవించింది.

తిరుగు ప్రయాణంలో నిందితుడు మచ్ఛాపూర్, పల్లారుగూడా రోడ్డు మార్గంలో ఆటోలో ప్రయాణించే సమయంలో నిందితుడైన సురేష్ తన తల్లిని ఆటోలోనే క్రింద పడవేసి కాలితో ఊపిరాడకుండా గట్టిగా నోక్కే సమయంలో.. ఇందుకు షేక్ రఫీ అంగీకరించకపోవడంతో నీ ఆటోలోన్ వాయిదా డబ్బు ఇస్తానని నిందితుడు సురేష్ ఆశ కల్పించడంతో నిందితులు ఇద్దరు కల్సి శౌరిని ఆటోలో వంజరపల్లి గ్రామ శివారు ప్రాంతానికి తీసువెళ్ళి బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు పోలీసులకు చిక్కకుండా హత్యకు వినియోగించిన బండరాయిని తీసుకుని ఆటోలో ప్రయాణిస్తూ మహరాజ తండ గ్రామ శివారులో పడవేయగా.. నిందితులు మృతురాలి సెల్‌ఫోన్‌ను ఎస్.ఆర్.ఎస్.పి. కెనాల్‌లో పడవేసి నిందితులు ఇద్దరు తిరిగి వారి ఇండ్లకు చేరుకున్నారు.

ఈ హత్యపై గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలు పెద్ద కుమారుడు సురేష్, మిత్రుడు షేక్ షఫీ ఈ హత్యకు పాల్పడినట్లుగా నిర్ధారణ కావడంతో ప్రధాన నిందితుడు మృతురాలి కుమారుడు సురేష్ ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు. ఈ మీడియా సమావేశంలో సంగెం ఎస్.ఐ భరత్, హెడ్ కానిస్టేబుళ్ళు ఖాసీం, చందర్, కానిస్టేబుళ్ళు కుమారస్వామి, రాజు, శంకర్, శ్రీనివాస్, అరుణ పాల్గోన్నారు.

Tags:    

Similar News