విషాదం.. కందిరీగల దాడిలో తల్లిబిడ్డ మృతి

మృత్యువు ఎటు నుంచి ఎవరిని ఆవహిస్తుందో ఎవరూ ఊహించలేరు. అల్లూరి ఏజెన్సీ(Alluri Agency)లో తల్లీబిడ్డలను కందిరీగల రూపంలో మృత్యువు కబళించింది. ఇద్దరి ప్రాణాలు మింగేసింది.

Update: 2024-10-26 12:08 GMT

దిశ,వెబ్‌డెస్క్: మృత్యువు ఎటు నుంచి ఎవరిని ఆవహిస్తుందో ఎవరూ ఊహించలేరు. అల్లూరి ఏజెన్సీ(Alluri Agency)లో తల్లీబిడ్డలను కందిరీగల రూపంలో మృత్యువు కబళించింది. ఇద్దరి ప్రాణాలు మింగేసింది. కందిరీగల దాడిలో తల్లీ బిడ్డ మృతి చెందిన విషాదకర ఘటన(Tragic incident) అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కండ్రుం పంచాయతీ జోడిగుడ గ్రామానికి చెందిన కిల్లో పొర్మిళ బుధవారం మధ్యాహ్నం తన కూతురు గీతాంజలి(18 నెలలు)ని వెంట బెట్టుకుని పొలం పనులకు వెళ్లారు. అక్కడ వారి పై కందిరీగలు(wasps) దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని స్థానికులు గుర్తించి అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి గురువారం మృతి చెందింది. పొర్మిళను విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మృతి ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.


Similar News