జీతం ఇవ్వని హోటల్ యజమాని.. ఆత్మహత్య చేసుకున్న వలస కూలీ..
తనకు ఆరోగ్యం బాగోలేదని తమ గ్రామానికి వెళ్లాలని పనిచేసిన కూలీ డబ్బులు ఇవ్వమని వలస కూలి డబ్బులు అడిగతే హోటల్ యజమానికి ఇవ్వకపోవడంతో కూలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దిశ, పరిగి : తనకు ఆరోగ్యం బాగోలేదని తమ గ్రామానికి వెళ్లాలని పనిచేసిన కూలీ డబ్బులు ఇవ్వమని వలస కూలి డబ్బులు అడిగతే హోటల్ యజమానికి ఇవ్వకపోవడంతో కూలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిగి ఎస్సై పి.విఠల్ రెడ్డి తెలిపిన విరవాల ప్రకారం పరిగిలోని కోడంగల్ చౌరస్తా సమీపంలోని శ్రీ పుడ్ ఫ్యాక్టరీలో పశ్చిమ బెంగాల్ రాష్ర్టం భరతమానే జిల్లా కాత్వాకాజే మండలం సనెరం మాత పాడ గ్రామానికి చెందిన బిపాల్ హజ్ర (26) కొంతకాలంగా పనిచేస్తున్నాడు. బిపాల్ హజ్రకు పదిహేను రోజులుగా ఆరోగ్యం బాగోలేదని తాను తన స్వగ్రామానికి వెళ్లేందుకు తాను పనిచేసిన కూలీ డబ్బులు (జీతం ) కావాలని శ్రీ పుడ్ ఫ్యాక్టరీ హోటల్ యజమాని, నిర్వాహుడు శ్రీకాంత్ రెడ్డిని అడిగాడు. ఇందుకు శ్రీకాంత్ రెడ్డి ఇంకా నెల పూర్తికాలేదని మధ్యలో జీతం డబ్బులు ఇవ్వను అని చెప్పాడు.
దీంతో బిపాల్ హజ్ర తనను పనిలో పెట్టిన టేకేదార్ కు ఫోన్ చేసి తన ఆరోగ్యం బాగోలేదని తాను తమ రాష్ట్రానికి వెళ్తాను డబ్బులు కావాలని అడిగాడు. దీనికి టేకేదార్ కూడా బిపాల్ హజ్రకు డబ్బులు ఇవ్వలేదు. ఇటు ఆరోగ్యం బాగోలేదని శ్రీ పుడ్ ఫ్యాక్టరీ వాళ్లు, అటు టేకేదార్ ఇద్దరూ డబ్బులు ఇవ్వడం లేదని ఎలా చేయాలంటూ మనోవేధనకు గురయ్యాడు. తాను పనిచేస్తున్న శ్రీ పుడ్ ఫ్యాక్టరీ పైన తాను ఉండే గదిలో పెంట్ హౌజ్ పైకి ఎక్కే నిచ్చనకు టవల్ తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిపాల్ హజ్ర స్నేహితుడు సందీప్ బిస్వాల్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పి.విఠల్ రెడ్డి తెలిపాడు. పరిగిలోని పలు హోటళ్లు, ఇతర పనుల్లో పనిచేస్తున్న వలస కార్మికులు, కూలీలకు పనిచేసిన డబ్బులు సక్రమంగా ఇవ్వకుండా వేధిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.