వడదెబ్బతో వ్యక్తి మృతి..

బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో మూడురోజుల క్రితం వడదెబ్బకు గురై మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు.

Update: 2023-06-19 16:02 GMT

దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో మూడురోజుల క్రితం వడదెబ్బకు గురై మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. భద్రాచలం పట్టణానికి చెందిన బూరుగు భాస్కర్(42) కుటుంబ కలహాలతో గత రెండున్నర ఏళ్లుగా నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో ఒంటరిగా ఉంటూ ట్రాక్టర్ డ్రైవరుగా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత శనివారం గ్రామానికి సమీపంలోని ఓ పొలంలోని సమాధి పై పడుకున్నాడు.

తీవ్రమైన వడగాలులకు దాహంతో వడదెబ్బకు గురై మృతి చెందాడు. అతనిని రెండురోజులుగా ఎవరు గుర్తించలేదు. సోమవారం ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అటువైపు పరిశీలించగా సమాధిపై ఓ మృతదేహాం బాగా ఉబ్బి కనిపించింది. రోజు సమాధిపైనే పడుకునే భాస్కర్ ని మృతదేహంగా గుర్తించారు. వడదెబ్బతోనే అతను మృతిచెంది వుంటాడని స్థానికులు భావిస్తున్నారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి శవపంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Tags:    

Similar News