గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..
మెండోరా మండలంలోని పోచంపాడు ఎక్స్ రోడ్ జాతీయ రహదారి 44 విద్యుత్

దిశ, బాల్కొండ : మెండోరా మండలంలోని పోచంపాడు ఎక్స్ రోడ్ జాతీయ రహదారి 44 విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుమారు ఉదయం 5 గంటలకు ఆర్మూర్ వైపు నుండి నిర్మల్ వైపు నడుచుకుంటూ వెళుతున్న పాదాచారిని వాహనం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలు అక్కడికక్కడే మృతి చెందాడని అన్నారు. మృతుని వివరాలు తెలియ రాలేదు అన్నారు.