గుండె పోటుతో చిరుత మృతి
గుండెపోటుతో ఇటీవల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: గుండెపోటుతో ఇటీవల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు అదే తరహాలో జంతువులు కూడా చనిపోతున్నాయి. తాజాగా గుండెపోటుతో ఓ మగ చిరుత మరణించింది. 2012 లో సౌదీ రాజా కుటుంబీకులు హైదరాబాద్ నెహూ జూపార్కును సందర్శించారు. ఆ సమయంలో రెండు (ఆడ, మగ) చిరుతలను బహుమతిగా ఇచ్చారు. అయితే ఆడ చీతా 12 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా 2020లో మరణించింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న మగ చీతా అబ్దుల్లా(15) నిన్న చనిపోయింది. కాగా.. చిరుత చనిపోవడంతో అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో చిరుత గుండెపోటుతోనే మరణించినట్లు నిర్ధారించారు.