Accident:జిరాక్స్ షాపులోకి దూసుకెళ్లిన లారీ.. వ్యక్తి మృతి

ఏపీలోని విశాఖపట్నం(Vishakapatnam) జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2024-12-31 13:58 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని విశాఖపట్నం(Vishakapatnam) జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ లేకపోవడంతో ఓనర్ లారీ నడిపాడు. దీంతో లారీ అదుపుతప్పి జిరాక్స్ షాపులోకి దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళితే.. గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఓ జిరాక్స్ షాప్‌లోకి లారీ దూసుకెళ్లడంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్న వెంకట రమణ(58) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అక్కడే ఉన్న ఓ మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే డ్రైవర్ లేకపోవడంతో ఆ ఇసుక ట్రక్కును ఓనర్ నడిపారని, బ్రేక్ ఫెయిల్ అవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.


Similar News