Lift Accident: స్కూల్లో ఒక్కసారిగా తెగిపడిన లిఫ్ట్.. ఆరుగురికి తీవ్ర గాయాలు
లిఫ్ట్ (Lift) తెగిపడి ఆరుగురికి గాయాలైన ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: లిఫ్ట్ (Lift) తెగిపడి ఆరుగురికి గాయాలైన ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేట్ (Amberpet) పరిధిలోని యూనినస్ గ్రూప్ ఆఫ్ స్కూల్ (Uninus Group of Schools)లో ఫస్ట్ ఫ్లోర్ (First Floor) నుంచి గ్రౌండ్ ఫ్లోర్ (Ground Floor)కు లిఫ్ట్ ఉన్నట్టుండి ఒక్కసారిగా లిఫ్ట్ తెగిపడింది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్‌లో మొత్తం 13 మంది ఉన్నారు. అందులో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగ్రాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.