పబ్లిక్ లోనే యువకుడిపై కత్తితో దాడి
పట్టపగలే యువకునిపై తల్వార్ తో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన గోదావరిఖనిలో చోటు చేసుకుంది.
దిశ, గోదావరిఖని : పట్టపగలే యువకునిపై తల్వార్ తో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన గోదావరిఖనిలో చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వినోబా నగర్ కు చెందిన నంది శ్రీనివాస్ పై మంచిర్యాల జిల్లా భీమారంనకు చెందిన బొల్ల శ్రావణ్, అతడి స్నేహితుడు ఇద్దరూ కలిసి తల్వార్ తో దాడి చేశారు. మహిళ విషయంలో వచ్చిన గొడవనే దీనికి కారణమని తెలిసింది. స్థానికులు వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. నిందితులని గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.