చికెన్ పకోడిలో కారం ఎక్కువైందని అడిగితే కష్టమర్ పై కత్తితో దాడి..
చికెన్ పకోడిలో కారం ఎక్కువైందని అడిగిన కస్టమర్ పై కేపీహెచ్‌బీ కాలనీలో చికెన్ పకోడి నిర్వహకుడు కత్తితో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దిశ, కూకట్పల్లి : చికెన్ పకోడిలో కారం ఎక్కువైందని అడిగిన కస్టమర్ పై కేపీహెచ్‌బీ కాలనీలో చికెన్ పకోడి నిర్వహకుడు కత్తితో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్‌బీకాలనీ ఆరవ ఫేజ్‌లో నివాసం ఉంటున్న ప్రణీత్ రెడ్డి బుధవారం రాత్రి కేపీహెచ్భీకాలనీ 9వ ఫేజ్ కూడలిలోని జేఎస్ చికెన్ పకోడి ఫుడ్ ట్రక్ వద్దకు వెళ్లి చికెన్ పకోడి ఆర్డర్ చేశాడు. చికెన్ పకోడి తింటుండగా కారం ఎక్కువవడంతో కస్టమర్ ప్రణీత్ రెడ్డి చికెన్ పకోడి నిర్వహకుడు జీవన్‌ను కారం కొంచం తక్కువ వేయోచ్చు కదా అని అడిగాడు. దీంతో జీవన్ కస్టమర్‌తో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కస్టమర్ ప్రణీత్ రెడ్డి మెడపై కత్తితో దాడి చేసేందుక ప్రయత్రించగా ప్రణీత్ రెడ్డి తన ఎడమ చేయి అడ్డు పెట్టాడు.
దీంతో ప్రణీత్ రెడ్డి ఎడమచేయి మోచేతి పై భాగంలో తెగి తీవ్ర గాయం ఏర్పడింది. వెంటనే ప్రణీత్ రెడ్డితో పాటు ఉన్న వారు ప్రణీత్ రెడ్డిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ప్రణీత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఎస్ చికెన్ పకోడి నిర్వహకుడు జీవన్ పై పోలీసులు కేసునమోదు చేశారు. ఇదిలా ఉండగా చికెన్ పకోడి నిర్వహకుడు స్థానిక కార్పొరేటర్‌కు అత్యంత సన్నిహిత వ్యక్తి కావడంతో కేసు నీరుగార్చే అవకాశం ఉందని బాధితులు తెలిపారు. చికెన్ పకోడి బండి వద్ద తరచు జీవన్ అతడి మనుషులు కస్టమర్లతో, చుట్టు పక్కల వారితో దురుసుగా ప్రవర్తిస్తు గొడవలు పడుతుంటారని గాయపడిన ప్రణీత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఇదిలా ఉండగా బాధితుడు ప్రణీత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని జీవన్ పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు సీఐ కిషన్ కుమార్ తెలిపారు.