Jani Master: ‘బెయిల్ ఇవ్వండి ప్లీజ్..’ కోర్టులో జానీ మాస్టర్ కొత్త రాగం

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించాడన్న ఆరోప‌ణ‌లతో పోక్సో కేసులో అరెస్టయిన డ్యాన్స్‌మాస్టర్ జానీ బెయిల్ కోసం కొత్త రాగం అందుకున్నాడు.

Update: 2024-10-02 06:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించాడన్న ఆరోప‌ణ‌లతో పోక్సో కేసులో అరెస్టయిన డ్యాన్స్‌మాస్టర్ జానీ బెయిల్ కోసం కొత్త రాగం అందుకున్నాడు. తను అవార్డ్ అందుకోవాలని, దానికోసం బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఒకపక్క నార్సింగ్ పోలీసులకు ఇచ్చిన నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో జానీని మళ్లీ ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశ పెట్టి చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. అక్టోబర్ 3వ తేదీ వరకు జానీ రిమాండ్ ఖైదీగా ఉండనున్నాడు.

ఇదిలా ఉంటే 5 రోజుల పాటు తనకి బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో జానీ పిటిషన్ దాఖలు చేశాడు. ‘‘నాకు బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ వచ్చింది. దానికోసం ఢిల్లీ వెళ్లి అవార్డు అందుకోవాల్సి ఉంది. అందుకు గాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వండి’’ అని కోర్టును కోరాడు. ఈ పిటిషన్‌పై అక్టోబర్ 7న విచారణ చేపడతామని రంగారెడ్డి ఫోక్సో కోర్టు తెలిపింది.

కాగా.. జానీ బెయిల్ పిటిషన్‌ని పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడిని బయటకు వదిలితే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందువల్ల అతడికి బెయిల్ మంజూరు చేయొద్దంటూ కౌంటర్ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. మరి దీనిపై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Similar News