అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థి మృతి
కనిపించకుండా పోయిన ఇంటర్ విద్యార్థి అనుమానస్పద పరిస్థితుల్లో చనిపోయి కనిపించాడు. ఈ విషాదం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శంషాబాద్ చారీ కాలనీ వాస్తవ్యుడు నిఖిల్
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో : కనిపించకుండా పోయిన ఇంటర్ విద్యార్థి అనుమానస్పద పరిస్థితుల్లో చనిపోయి కనిపించాడు. ఈ విషాదం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శంషాబాద్ చారీ కాలనీ వాస్తవ్యుడు నిఖిల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్. గత నెల 20 న కాలేజీ కి వెళ్తున్న అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు అతని స్నేహితులతో మాట్లాడినా వివరాలు తెలియలేదు. చుట్టు పక్కల గాలించినా ఆచూకి లభించలేదు. దాంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. విచారణలో ఆ రోజు నిఖిల్ కాలేజీకి వెళ్లలేదని తెలిసింది. సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించగా స్థానికంగా ఉన్న క్రికెట్ గ్రౌండ్ కు వెళ్లినట్టు తెలిసింది. చీకటి పడేవరకు అక్కడే ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయినట్టు తెలియ వచ్చింది. కాగా, మంగళవారం నిఖిల్ మృతదేహం చారీ నగర్ కు కొద్ది దూరంలో ఉన్న చెరువులో కనిపించింది. సమాచారం తెలిసి అక్కడకు వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కాగా, నిఖిల్ ది హత్యే అన్న అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేసారు.