అంతర జిల్లా దొంగ ఆరెస్ట్
ఒంటరిగా కనిపించే వృద్ధాప్య మహిళలను అనుసరిస్తూ వారికి పెన్షన్ ఇప్పిస్తా అని మాయమాటలతో నమ్మించి బంగారు ఆభరణాలు దొంగిలించే అంతర్ జిల్లా దొంగను పోలీసులు ఆరెస్ట్ చేశారు.
దిశ, పెద్దపల్లి : ఒంటరిగా కనిపించే వృద్ధాప్య మహిళలను అనుసరిస్తూ వారికి పెన్షన్ ఇప్పిస్తా అని మాయమాటలతో నమ్మించి బంగారు ఆభరణాలు దొంగిలించే అంతర్ జిల్లా దొంగను పోలీసులు ఆరెస్ట్ చేశారు. సోమవారం అరెస్ట్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 25న పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం ముందు నుండి వెళ్తున్న బొంపెల్లి గ్రామస్తురాలైన గుర్రాల సత్తమ్మ అనే వృద్ధురాలితో ఒక గుర్తు తెలియని వ్యక్తి నీకు పెన్షన్ రావట్లేదు కదా? నేను ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మెడలో బంగారు వస్తువులు ఉంటే పెన్షన్ రాదని చెప్పి ఆమెను నమ్మించాడు.
ఆమె మెడలో నుండి బంగారు పుస్తెల తాడును తీపించి ఆమె నుంచి రూ.80 వేల విలువగల 2 తులాల పుస్తెలతాడును దొంగిలించాడు. గుర్రాల సత్తమ్మ ఫిర్యాదు ఇవ్వగా పెద్దపల్లి ఎస్హెచ్ఐ మల్లేష్ కేసు నమోదు చేసి పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్ సూచనల మేరకు ఎస్ఐ లక్ష్మణ్‌రావు సారథ్యంలో వివిధ జిల్లాల పోలీస్ అధికారులతో సమాచారాన్ని సేకరించారు. వివిధ జిల్లాల్లో ఇదే నేర విధానం ఉండి పలు కేసులలో నిందితుడైన అల్లెపు కృష్ణను అరెస్ట్ చేశారు.