Illegal liquor: సంతలో లిక్కర్ అమ్మకాలు.. ఎక్సైజ్ దాడితో పరార్

సంతల్లో బహిరంగంగానే అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్న ఘటన కలకలం రేపింది.

Update: 2024-10-28 04:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: సంతల్లో బహిరంగంగానే అక్రమ మద్యం (Illegal Liquor) అమ్మకాలు జరుగుతున్న ఘటన కలకలం రేపింది. పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా తణుకులో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. స్థానిక సంత మార్కెట్‌లో కొంతమంది బెంచ్‌లపై మద్యం బాటిళ్లను పెట్టుకుని దర్జాగా బహిరంగ మద్యం అమ్మకాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియా (Social Media)లో వైరల్‌గా మారడంతో కలకలం రేగింది. ఇవి ఎక్సైజ్, పోలీసు అధికారులు కంట పడడంతో హుటాహుటిన ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. దీంతో నిందితులు పరారయ్యారు. అయితే ఫోటోలు, వీడియోల ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ (Arrest) చేసినట్లు ఎక్సైజ్ సీఐ మణికంఠ రెడ్డి, పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. నిందితులను తణుకు పట్టణానికి చెందిన షేక్ మున్న, కొప్పిశెట్టి శివశంకర్, కొల్లి సుకన్యలుగా గుర్తించారు పోలీసులు. నిందితుల వద్ద రూ.7,800 విలువైన 60 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

ఇదిలా ఉంటే ఏపీలో ఇటీవలే కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. పాత ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించగా.. కొత్తగా కూటమి ప్రభుత్వం తెచ్చిన పాలసీతో మద్యం దుకాణాల నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు వ్యక్తులకు దక్కాయి. అయితే దానికోసం లక్షలు ఖర్చు చేసి, టెండర్లు పాడి లైసెన్స్‌లు తీసుకున్నారు. 


Similar News