Illegal Affair: ఇంట్లో ఇల్లాలు.. లాడ్జిలో లవర్.. సరసాల సారు బాగోతం.. భార్య ఏం చేసిందంటే..

పెళ్లాం పిల్లల్ని వదిలి ప్రియురాలితో లాడ్జి (Lodge)లో రొమాన్స్ చేస్తున్న ఓ సారు సరసాల బాగోతం బట్టబయలైంది.

Update: 2024-10-28 07:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లాం పిల్లల్ని వదిలి ప్రియురాలితో లాడ్జి (Lodge)లో రొమాన్స్ చేస్తున్న ఓ సారు సరసాల బాగోతం బట్టబయలైంది. భర్త ఇంటికి రావడం మానేయడంతో అనుమానం వచ్చిన భార్య నిఘా పెట్టి మరీ.. లాడ్జిలో లవర్‌తో ఉన్నప్పుడు రెడ్‌హ్యాండెడ్‌ (Red-Handed)గా పట్టుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

అసలేం జరిగిదంటే జిల్లాలోని ఓ ప్రాంతంలో ఎంపీడీవో (MPDO)గా పనిచేస్తున్న ఓ అధికారి సార్వత్రిక ఎన్నికల సమయంలో చిత్తూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు. అక్కడే ఆయనకు ఓ ఏఎన్‌ఎంతో పరిచయమైంది. ఆ పరిచయం వివాహేతర సంబంధాని (Illegal Affair)కి దారితీసింది. దీంతో ఆమె మోజులో పడి భార్యాపిల్లలను దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు సదరు అధికారి.

దీంతో భార్యకు అనుమానం వచ్చి ఆయన కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఆయనకి, ఏఎన్‌ఎం (ANM)కి మధ్య ఉన్న సంబంధం గురించి తెలిసింది. అయితే ఇద్దరినీ కలిపి పట్టుకోవాలని అనుకున్న భార్య.. ఆదివారం మధ్యహ్నం ఒంగోల్‌లోని ఓ లాడ్జిలో ఇద్దరూ ఉన్నట్లు తెలుసుకుని హుటాహుటిన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు వెళ్లింది. ఇంకేముంది ప్రియురాలి (Lover) కౌగిట్లో మురిసిపోతున్న సారు సరసాలు బట్టబయలయ్యాయి. విషయంత తెలియగానే తాలూకా పోలీసులు (Police) ఘటనా స్థలానికి చేరుకుని ఎంపీడీవో, ఆయన ప్రియురాలిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ (Counceling) ఇచ్చారు. 


Similar News